NTV Telugu Site icon

Israel-Hezbollah: పేజర్ల పేలుడు మిస్టరీ బయటపెట్టిన ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్లు

Explodingpagers

Explodingpagers

పశ్చిమాసియాలో సెప్టెంబర్ 17న ఊహించని విపత్తు తీవ్ర కలకలం రేపింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో హఠాత్తుగా హిజ్బుల్లా చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అనంతరం అంత్యక్రియలు జరిగే సమయంలో కూడా మరోసారి వాకీటాకీల పేలుడు జరిగాయి. పేజర్లు పేలిన మరుసటి రోజే వాకీటాకీలు కూడా పేలిపోయాయి. ఈ ఘటనలో కూడా పలువురు చనిపోయారని వార్తలు వినిపించాయి. ఈ పరిణామాలతో హిజ్బుల్లాతో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. పేజర్లు, వాకీటాకీలు పేలడం పెద్ద సంచలనంగా మారిపోయింది. అయితే ఇజ్రాయెల్‌ పనేనంటూ లెబనాన్ ఆరోపించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉంది.

ఇది కూడా చదవండి: Earthquake: ప్రకాశం జిల్లాను వదలని భూప్రకంపనలు.. వరుగా 3 సార్లు కంపించిన భూమి

తాజాగా పేజర్లు, వాకీటాకీల పేలుడుపై ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్లు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. పేజర్లు కొనగోలు విషయంలో హిజ్బుల్లా ఎలా మోసపోయిందో వెల్లడించారు. రాయిటర్స్ సమాచారం ప్రకారం.. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్.. విదేశీ గడ్డపై అధునాతన కార్యకలాపాలకు సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 17 పేలుడుకు సంవత్సరాల ముందు హిజ్బుల్లా దిగుమతి చేసుకున్న పేజర్లలో పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ అమర్చిందని పేర్కొంది. ఈ మేరకు ముసుగు వేసుకున్న ఇద్దరు రిటైర్డ్ సీనియర్ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వెల్లడించారు. 10 ఏళ్ల క్రితమే పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చే ప్లాన్ అమలైందని వెల్లడించారు. హిజ్బుల్లా.. తైవాన్ ఆధారిత కంపెనీ నుంచి పేజర్లను కొనుగోలు చేస్తుందన్న విషయం తెలుసుకున్నాక.. ఇజ్రాయెల్ ఎంట్రీ అయి పగడ్బందీగా ప్లాన్ అమలు చేసిందని వెల్లడించారు. హిజ్బుల్లా 16,000 వాకీ-టాకీలను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 17న హిజ్బుల్లా ఉగ్రవాదులు 5,000 పేజర్లను ఉపయోగించారు. అవి పేలిపోయాయి. మరుసటి రోజు మొస్సాద్ వాకీ-టాకీలను యాక్టివేట్ చేశారు. వాటిలో కొన్ని పేజర్ దాడులలో మరణించిన వారి అంత్యక్రియల సమయంలో పేలాయి. ఈ ఘటనల్లో చాలా మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: U23 State Trophy: మెరిసిన యువ సంచలనం.. 21 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఢిల్లీ ప్లేయర్

Show comments