Technical Recession: ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో భయపడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా మహమ్మారి, పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్భణ పరిస్థితులు ప్రపంచాన్ని మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూరప్ తో పాటు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. ఈ ప్రభావం ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పలు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థ అంతా బాగుందని బయటకి ప్రకటిస్తున్నప్పటికీ లోలోపల భయపడుతున్నాయి.
Read Also: Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: ఏపీ బీజేపీ పెద్దలు.. 10న నడ్డా, 11న అమిత్‌షా..
ఇదిలా ఉంటే 2023 ప్రారంభంలోనే యూరోజోన్(యూరో కరెన్సీగా వాడుతున్న 20 దేశాలు) మొత్తం సాంకేతికంగా ఆర్థికమాంద్యంలోకి ప్రవేశించిందని తెలుస్తోంది. యూరోస్టాట్ 2022 చివరి త్రైమాసికంలో 0 శాతం వృద్ధిని మరియు 2023 మొదటి త్రైమాసికంలో 0.1 శాతం వృద్ధి నమోదు కాగా.. రెండు కాలాల్లోనూ 0.1 శాతాని వృద్ధిని తగ్గించింది. వరుసగా రెండవ త్రైమాసికంలో 0.1 శాతం గ్రోత్ తగ్గింది. ద్రవ్యోల్భణం, అధిక వడ్డీరేట్లు ఐరోపా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను అరికట్టడంతో ఊహించినదాని కన్నా దారుణమైన గణాంకాలు నమోదు అవుతున్నాయి. వరసగా రెండు త్రైమాసికాల్లో స్థూల దేశీయోత్పత్తి తగ్గిపోవడాన్ని సాంకేతిక మాంద్యం మొక్క థ్రెషోల్డ్ లిమిట్ గా భావిస్తారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత యూరప్ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్భణానికి దారి తీసింది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు, తమను తాము దెబ్బతీసుకున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గతేడాది జూలైలో ద్రవ్య బిగింపులో బాగంగా కీలక రేట్లను 3.75 శాతం పెంచింది. అయితే తాజా గణాంకాలు మాత్రం 2023కి సంబంధించి ఆశాజనక అంచనాలపై సందేహాలను తలెత్తాలా చేశాయి. ఒకే కరెన్సీని ఉపయోగించే 20 దేశాలలో సంవత్సరానికి వృద్ధి 1.1 శాతానికి చేరుకుంటుందని యూరోపియన్ కమిషన్ మే మధ్యలో అంచనా వేసింది.
