Site icon NTV Telugu

Airbus A380: ఏయిర్ బస్ విమానానికి తప్పిన ముప్పు.. 13 గంటల తర్వాత సేఫ్ ల్యాండింగ్

Airbus A380

Airbus A380

ఇటీవల కాలంలో తరుచుగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇండియాలో రెండుసార్లు స్పైస్ జెట్ విమానాలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే తాాజాగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ కు వెళ్తున్న ఎయిర్ బస్ ఏ3780 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జూలై 1న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ విమానం బ్రిస్బేన్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ఎడమ రెక్కకు భారీ రంధ్రం ఏర్పడింది.

Read Also: Femina Miss India 2022: మిస్ ఇండియాగా సినిశెట్టి

విమానం దుబాయ్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో పైలెట్లు పెద్ద శబ్దాన్ని గమనించారు. అయితే సిబ్బంది విమానం టైర్ పేలినట్లు అనుమానించారు. దుబాయ్ నుంచి బ్రిస్బేన్ కు 13.5 గంటలు పాటు ప్రయాణించిన విమానం, బ్రిస్బేన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించిన పైలెట్లు, అత్యవసర సహాయాన్ని సిద్ధంగా ఉంచాలని కోరారు. పైలెట్లు చాకచక్యంగా విమానాన్ని బ్రిస్బేన్ విమానాశ్రయంలోని 19 ఆర్ రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ కాగానే.. ఎడమరెక్కపై పెద్ద రంధ్రాన్ని గమనించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ నుంచి బోల్ట్ విడిపోయి రెక్కను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతోనే ఎడమ రెక్కలోని ఔటర్ భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడినట్లు అనుమానిస్తున్నారు.

Exit mobile version