Site icon NTV Telugu

Russia-Ukraine War: తక్షణమే ‘కీవ్‌’ని వీడండి.. కేంద్రం కీలక ఆదేశాలు..

ఉక్రెయిన్‌-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్‌ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్‌ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Zain Nadella: సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత..

ఇక, కీవ్‌లో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అని హెచ్చరించి భారత ప్రభుత్వం.. మరోవైపు సీ-17 విమానాలను ఉక్రెయిన్‌ పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఉక్రెయిన్‌లోని వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. మరోవైపు.. ఇప్పటికే కీవ్‌లో తమ రాయబారులను ఖాళీ చేయించింది అమెరికా.. కాగా, ఓ వైపు చర్చలు, మరోవైపు యుద్ధం… బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరో రోజు భీకర పోరు నడుస్తోంది. కీలకమైన కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. అదేస్తాయిలో ఉక్రెయిన్ ఆర్మీ కూడా దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటి వరకు కీవ్‌ తమ ఆధీనంలోనే ఉందని ఉక్రెయిన్‌ చెబుతున్నా.. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Exit mobile version