Elon Musk’s New Twitter Poll On Edward Snowden, Julian Assange: ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత వరసగా వివాదాల్లో నిలుస్తున్నారు మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విట్టర్ లో మార్పులు చేస్తూ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ పోల్స్ ద్వారా కొన్ని అంశాలపై నెటిజెన్ల అభిప్రాయాలను కోరుతున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తేయాలా..? అంటూ ఇటీవల యూజర్ల అభిప్రాయాన్ని కోరారు. చాలా మంది నిషేధం ఎత్తేయడానికే ఓటేయడంతో ట్రంప్ ఖాతా మళ్లీ పునరుద్ధరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎలాన్ మస్క్ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై పెట్టిన ట్విట్టర్ పోల్ వివాదాస్పదం అయింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఆదివారం మరో ట్విట్టర్ పోల్ పెట్టారు. వివాదాస్పద వ్యక్తులు అయిన విజిల్ బ్లోయిర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేలపై ట్విట్టర్ పోల్ నిర్వహించారు. వీరిద్దరు క్షమింపబడాలా..? అంటూ యూజర్ల అభిప్రాయాలను కోరారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. అసాంజే, స్నోడెన్ ఇద్దరూ యూఎస్ సైనిక విషయాలను బహిర్గతం చేశారు. సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేయడంపై వీరిద్దరిపై అమెరికా ఆగ్రహంతో ఉంది.
Read Also: Badruddin Ajmal: హిందువులపై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా..క్షమించండి..
గతంలో అమెరికాకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేసి వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే సంచలనం సృష్టించారు. అయితే అప్పటి నుంచి అసాంజే వివిధ దేశాల ఆశ్రయం కోరుతున్నారు. చాలా ఏళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నారు. ప్రస్తుతం యూకే, అమెరికాకు తనను అప్పచెప్పకుండా న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు ఎడ్వర్డ్ స్నోడెన్ కూడా యూఎస్ సైనిక వివరాలను బహిర్గతం చేశారు. ఆ తరువాత అక్కడి ప్రభుత్వం నుంచి తప్పించుకుని ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ప్రభుత్వం స్నొడెన్ కు రష్యా పౌరసత్వాన్ని ఇచ్చింది.
I am not expressing an opinion, but did promise to conduct this poll.
Should Assange and Snowden be pardoned?
— Elon Musk (@elonmusk) December 4, 2022