Elon Musk’s Email To Twitter Staff Asks Them To Answer a Single Question: ట్విట్టర్ ఉద్యోగులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు కొత్త బాస్ ఎలాన్ మస్క్. కంపెనీలో కొనసాగుతానని హమీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సొంతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు మరికొంత మంది కీలక ఉద్యోగాలను తొలగించారు. దీంతో పాటు ట్విట్టర్ ఉద్యోగుల్లో 50 శాతం అంటే దాదాపుగా 3800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఈ ఆధారాలే కీలకం.. వాటినే మిస్ అవుతున్న పోలీసులు
ఇదిలా ఉంటే మిగిలిన ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు ఎలాన్ మస్క్. టైంతో సంబంధం లేకుండా కంపెనీలో కొనసాగుతామని హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఒక వేళ అలా ఇవ్వలేకపోతే 3 నెలల జీతం తీసుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. ఈ మేరకు ట్విట్టర్ ఉద్యోగులకు సింగిల్ క్వశ్చన్ తో కూడిని ఫాంని మెయిల్ చేశాడు. గురువారం సాయంత్ర 5 గంటలలోపు ఫాం ఫిల్ చేసి పంపాలని గడువు కూడా విధించారు.
అయితే ట్విట్టర్ లో కేవలం ప్రతిభావంతులకు మాత్రమే అవకాశం ఉంటుందని ఈ మెయిల్ లో తెలిపారు. మస్క్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో మీరు ట్విట్టర్ లో కొనసాగాలనుకుంటున్నారా..? అనే ప్రశ్నకు కేవలం ‘ఎస్’ అనే ఆప్షన్ మాత్రమే ఉంది. దీంతో ఉద్యోగులంతా అయోమయానికి గురవుతున్నారు. దీనిపై ఎలా స్పందించాలనే దానిపై కొంతమంది ఉద్యోగులు లాయర్లను ఆశ్రయిస్తున్నారు. రానున్న కాలంలో ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే బ్లూ టిక్ కోసం 8 డాలర్లను కట్టాలని స్పష్టం చేశాడు ఎలాన్ మస్క్. ఇండియాలో ట్విట్టర్ బ్లూ కోసం రూ.719 కట్టాల్సిందే.