NTV Telugu Site icon

Twitter: ట్విట్టర్‌లోకి టెస్లా ఉద్యోగులు.. కీలక చర్య దిశగా ఎలాన్ మస్క్

Twitter Elon Musk

Twitter Elon Musk

Elon Musk may take Tesla employees to Twitter: ట్విట్టర్ కంపెనీ హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. తాజా అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రానున్న రోజుల్లో ట్విట్టల్ నుంచి చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: Hyderabad: పార్కులకు వెళ్లే లవర్స్‌కు చేదువార్త.. ఆ పని చేస్తే దొరికిపోతారు

ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక చర్య దిశగా ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇతర కంపెనీల నుంచి ట్విట్టర్ లో పనిచేయడానికి ఉద్యోగులను తీసుకురానున్నట్లు సీఎన్‌బీసీ ఓ నివేదికలో తెలిపింది. మస్క్ కంపెనీ టెస్లా నుంచి 50 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆటోపైలెట్, బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ నుంచి కూడా ఉద్యోగులను తీసుకోనున్నట్లు సమాచారం. టెస్లా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అశోక్ ఎల్లుస్వామి, ఆటోపైలట్, టెస్లాబాట్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మిలన్ కోవాక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ డైరెక్టర్ మహా విర్దుహగిరిలతో పాటు ఎలాన్ మస్క్ బాగా విశ్వసించే వారిని ట్విట్టర్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 28న ట్విటర్ ను టేకోవర్ చేశారు ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. రావడం రావడంతోనే సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ తో పాటు సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయగద్దెలను తొలగించారు. తాజాగా బ్లూటిక్ ఉన్నవారి నుంచి నెలకు 8 డాలర్లను వసూలు చేస్తామని మస్క్ ప్రకటించారు. బ్లూటిక్ వైడిఫైడ్ ఖాతాలకు మరిన్ని అదనపు ఫీచర్లు అందిస్తామని వెల్లడించారు.