Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్‌లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Rains Alert: తెలంగాణలో వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్
తాజాగా సంభవించిన భూకంపం భూమి అంతర్భాగంలో 79 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రాజధానిలోని సెనెట్, అధ్యక్ష భవనం, న్యాయమంత్రిత్వ శాఖ భవనాలను ఉద్యోగులు ఖాళీ చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చారు. దీనికి ముందు శనివారం అక్కడ 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటంతో పాటు భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉంటోంది. దీని వల్లే ఆ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. సునామీల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.