NTV Telugu Site icon

Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం

Indonesia

Indonesia

Earthquake of 4.7 magnitude jolts Indonesia: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఇవాళ తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

గత వారం రోజులుగా వరుస భూకంపాల పలు దేశాలను బెంబేలెత్తిస్తుండటంతో.. తైవాన్, మెక్సీకోలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తరుచూ భూకంపాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఇండోనేషియాలోనూ మరోసారి భూకంపం సంభవించింది. అయితే.. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో శుక్రవారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే.. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇక భూకంపానికి సంబంధించి, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా ట్వీట్ చేసింది. గతనెల ఆగస్టు 23న ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌లోని బెంగ్‌కులులో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మెక్సికోలో బలమైన భూకంపం సంభవించింది అదే సమయంలో పశ్చిమ మెక్సికోలో నిన్న ఉదయం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా మెక్సికో సిటీలో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. మెక్సికోలో ఈ వారంలో ఇది రెండోసారి. గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మరెక్కడా తీవ్రమైన నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
CM Nitish Kumar: సోనియాగాంధీతో భేటీ కానున్న నితీష్ కుమార్, లాలూ.. మహాకూటమి లక్ష్యంగా అడుగుల