Site icon NTV Telugu

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

Earthquake

Earthquake

earthquake Hits Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా సుమత్రా ద్వీపానికి నైరుతి దిక్కులో బుధవారం 6 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.

Read Also: Kiran Bedi: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై నిఘా ఉంచాలి..

ఇండోనేషియా దేశం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్ లో ఉంది. ఈ ప్రాంతంలో సముద్రం అడుగు భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సముద్రగర్భంలో అగ్నిపర్వతాల విస్పోటనాల వల్ల అక్కడి నిత్యం భూకంపాలు వస్తుంటాయి. భూమి కింది పొరల్లో ఈ పలకల కదలికలు, ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల అమితమైన శక్తి విడుదల అవుతుంది. దీంతో ఈ శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తుంది. 2004లో హిందూమహాసముద్రంలో ఇండోనేషియా సుమత్రాలో వచ్చిన బాక్సింగ్ డే సునామీ వల్ల ఏకంగా 2 లక్షల మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్లా టెక్టానిక్ ప్లేట్ ఘర్షణ కారణంగా ఈ భూకంపం, సునామీ ఏర్పడింది.

Exit mobile version