S. Jaishankar: పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించకపోతే.. అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదన్నారు. అయితే, భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమన్నారు. అలాంటిది మనమే టెర్రరిజాన్ని విస్మరించడం, తక్కువగా చూపడం మన ప్రయోజనాలకే విరుద్ధమని వెల్లడించారు. ఎలాంటి తీర్మానాన్ని అయినా.. అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతతో భారత్ చూస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని ఢిల్లీ ఖండిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
Read Also: Minister Sridhar Babu: తెలంగాణకు రూ.2వేల కోట్ల కొత్త పెట్టుబడులు.. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు
ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికి అయినా ప్రతి స్పందించే హక్కు ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకుని.. మానవీయ చట్టాలకు, కాల్పుల విరమణకు, హింస ముగింపునకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక, ఇజ్రాయెల్‌లో రక్షణ సహకారంపై కూడా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధం కొనసాగుతుందన్నారు. మన భద్రత ప్రమాదంలో పడినప్పుడు అండగా నిలిచిందన్నారు. మనం జాతీయ భద్రతా ప్రయోజనాలను బట్టి ముందుకు వెళ్తామని విదేశాంగ మంత్రి అన్నారు.
Read Also: BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజు కు షిఫ్ట్ చేయండి..
కాగా, ఇజ్రాయెల్‌లో యూఎన్‌ఆర్‌ఏడబ్ల్యూ సంస్థను నిషేదించడంపై భారత్ వైఖరి ఏంటని టీఎంసీ నేత సాకేత్ గోపాల్ ప్రశ్నించగా.. అలాగే, వెస్ట్‌బ్యాంక్‌లో అక్రమ సెటిల్మెంట్లపైనా విదేశాంగ మంత్రి రియాక్ట్ కావాలని కోరారు. దీనికి జైశంకర్ ఆన్సర్ ఇస్తూ.. UNRAWకు సపోర్టు ఇవ్వడంతో పాటు సహకరించాలని భారత్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. తాజాగా ఆ సంస్థకు సహాయం కూడా పంపించాం.. ఏటా ఐదు మిలియన్ డాలర్ల సాయం పంపిస్తున్న విషయాన్ని సభలో తెలిపారు. పాలస్తీనా ప్రజలకు అవసరమైన సహాయం భారత్ నుంచి అందిస్తున్నామని.. ఇప్పటికే 70 మెట్రిక్ టన్నుల సహాయ సామగ్రి, 16.5 మెట్రిక్ టన్నుల ఔషధాలను అందించామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.