NTV Telugu Site icon

Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. టర్కీ విషయంలో తప్పని అంచనా.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

Pakistan Earthquake

Pakistan Earthquake

Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.

Read Also: Earthquake: మేఘాలయలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు

గతంలో టర్కీలో భారీ భూకంపం వస్తుందని అంచనా వేసిన కొన్ని రోజులకే భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల టర్కీ, సిరియా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. గతంలో ఢిల్లీలో కూడా భూకంపం వస్తుందని హెచ్చరించాడు. ఈ హెచ్చరికల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

తాజాగా ఆయన ప్రకటనతో పాక్ ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అయితే ఆయన ప్రకటనపై పాకిస్తాన్ మెట్రొలాజికల్ డిపార్ట్మెంట్ స్పందించలేదు. బలూచిస్తాన్ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతంలో భూమి అడుగున ఫాల్ట్ లైన్ యాక్టివిటీ బాగా పెరిగొందని, రాబోయే కొన్ని గంటల్లో భారీ భూకంపం వస్తుందని ఫ్రాంక్ హూగర్‌బీట్స్ తెలిపారు. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి.