Site icon NTV Telugu

Dubai: తన బిడ్డకు ‘‘హింద్’’ అని పేరు పెట్టిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..

Hind

Hind

Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆయన భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ శనివారం వారి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఆడబిడ్డకు ‘‘హింద్’’గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తన తల్లి షేఖా హింద్ బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్థం నవజాత శిశువుకు ‘హింద్’ అని పేరు పెట్టారు.

Read Also: CM Revanth Reddy : నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా జైల్లో ఉండేది

క్రౌన్ ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ వార్తను వెల్లడించారు. ఆమెకు ఆరోగ్యం కోసం, శ్రేయస్సు కోసం అల్లాహ్‌ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కౌన్స్ ప్రిన్స్ జంటకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. ‘‘హింద్’’ అనే పేరు అరబిక్ మూలానికి చెందినది. బలం, సంపద, గొప్పతనాన్ని ఇది సూచిస్తుంది. 2008 నుంచి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా ఈయన పనిచేస్తున్నారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుబాయ్ షక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేఖా హింద్‌లకు ఇతను రెండో సంతానం. ‘‘ఫజ్జా’’గా పేరున్న క్రౌన్ ప్రిన్స్ 2019లో తన బంధువు షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తూమ్‌ని వివాహం చేసుకున్నారు.

Exit mobile version