NTV Telugu Site icon

Iran: “ఇజ్రాయిల్‌కి సాయం చేయవద్దు, లేదంటే”.. సౌదీ, యూఏఈలకు ఇరాన్ వార్నింగ్..

Israel Iran

Israel Iran

Iran: ఇజ్రాయిల్-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమువుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్‌‌లను హతం చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక నాయకుడు హసన్ నస్రల్లాని చంపేసింది, ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న హసీమ్ సఫీద్దీన్‌ని కూడా చంపేసింది. హిజ్బుల్లా ప్రధాన కమాండర్లని చంపేసింది. ఇదిలా ఉంటే, హజ్బుల్లాపై దాడికి ప్రతిస్పందనగా, ఇటీవల ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగింది.

ఈ పరిణామాలు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పాదా..? అనే స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌కి సాయం చేయడంపై ఇతర దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అరబ్ దేశాలు, తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా తమ భూభాగాలను అమెరికా లేదా ఇజ్రాయిల్ ఉపయోగించేలా సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జోర్డాన్ వంటి చమురు సంపన్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య దౌత్యమార్గాల ద్వారా ఈ హెచ్చరికలు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ దేశాలన్నీ కూడా అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చాయని చెప్పింది.

Read Also: Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడులు జరిపిన తర్వాత.. ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణు లేదా చమురు మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్, అమెరికాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తన ఇరుగుపొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ మౌలిక సదుపాయాలు అమెరికా రక్షణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది.

ఒకవేళ ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారితే, హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతుంది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రధానమైన చోక్ పాయింట్. చముదు రవాణాలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఇది ప్రపంచ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కి వ్యతిరేకంగా జరిగే సైనిక దాడుల్లో తమ ప్రమేయం ఉండకూడదని ఇటీవల యూఏఈ, సౌదీ అరేబియాతో సహా అరబ్ దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. తాము న్యూట్రల్‌గా ఉంటామని చెప్పారు.

ఇదిలా ఉంటే, పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ పరిశ్రమలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ క్షిపణి కార్యక్రమాలు, అణు కార్యక్రమాలకు నిధులను కట్టడి చేసేందుకే అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలపై ఇరాన్-ఇజ్రాయిల్ పరిణామాలు ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి.

Show comments