Site icon NTV Telugu

Donald Trump: కమలా హరీస్ గెలిస్తే.. చైనా చెడుగుడు ఆడేస్తుంది..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థుల ప్రచారంలో మరింత జోరు పెంచారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం హామీలతో పాటు పరస్పర విమర్శలు చేస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా యూఎస్ ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమె అధికారంలోకి వస్తే డ్రాగన్ కంట్రీ చైనా చెడుగుడు ఆడేస్తుందని ఎద్దేవా చేశారు.

Read Also: Uttar Pradesh: అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై యూపీ ఏటీఎస్ విచారణ..

ఇక, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌ ఓ రేడియో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్‌ మాట్లాడుతూ.. ఒకవేళ కమలా హారిస్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆమె చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంటది.. అప్పుడు ఆమె పట్ల జిన్‌పింగ్‌ ఎలా వ్యవహరిస్తారు అని ట్రంప్‌ను ప్రశ్నించగా.. దీనికి మాజీ అధ్యక్షుడు సమాధానం ఇస్తూ.. ఓ చిన్న పిల్ల మాదిరిగా హరీస్ ను చూస్తారు అంటూ కామెంట్స్ చేశాడు.

Exit mobile version