Donald Trump on Russia-Ukraine conflict: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వాడిని అని ట్రంప్ వెల్లడించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే మిలియన్ సంవత్సరాల్లో కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని అన్నారు. ఈ భయంకరమైన యుద్ధాన్ని కేవలం 24 గంటల్లో ముగించేందుకు చర్చలు జరపగలనని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సాయాన్ని తప్పు బట్టారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా తయారీ అబ్రమ్స్ ట్యాంకులను ఉక్రెయిన్ కు పంపనున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇది రష్యాను రెచ్చగెట్టే చర్య అని సూచించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు స్కీం.. కోటంరెడ్డి లాంటివాళ్లు పాత్రధారులు
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఈ నెలతో 12 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే రష్యా చర్చలకు సిద్ధం అని చెబుతున్నప్పటికీ.. తాను ఆక్రమించిన ప్రాంతాల మెలికపెట్టకుంటేనే చర్చలు అని చెబుతోంది. ఇక ఉక్రెయిన్, రష్యాకు అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది. ఇప్పటికే అమెరికా, ఉక్రెయిన్ దేశానికి భారీ ఎత్తున సైనిక, ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా జర్మనీతో కలిసి 31 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు పంపిస్తామని యూఎస్ఏ తెలిపింది.
