NTV Telugu Site icon

పాకిస్తాన్‌లో ట్రంప్‌…కుల్పీలు అమ్ముతూ వైర‌ల్‌…

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌డెన్‌గా పాకిస్తాన్ లో ప్ర‌త్య‌క్షం అయ్యారు.  అందులోనూ పాక్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్ వేసుకొని వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు.  స‌డెన్ చూసిన వారు.. ఇదేంటి ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నారు అని అనుకొవ‌చ్చు.  కానీ అత‌ను ట్రంప్ కాదు.  ట్రంప్‌కు ద‌గ్గ‌ర పోలిక‌ల‌తో ఉన్న వ్య‌క్తి.  పాక్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తుంటాడు.  ట్రంప్ పోలిక‌ల‌తో ఉండ‌టంతో అత‌డిని ఫొటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.  అధ్య‌క్ష‌ప‌ద‌వి కొల్పోవ‌డంతో జీవ‌నాధారం కోసం కుల్ఫీలు అమ్ముకుంటున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు