Site icon NTV Telugu

Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై దాడి.. ఖండించిన ట్రంప్

Trump

Trump

Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. ఈ సందర్భంగా హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లు అమెరికాతో పాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఇక, బంగ్లాతో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీ వర్గాలపై జరిగిన దాడితో పాటు అల్లరి మూకలు వారి ఇళ్లు, దుకాణాలను దోచేశారు.. దీంతో ఆ దేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.

Read Also: Spain Floods : స్పెయిన్ లో బీభత్సం సృష్టించిన వరదలు.. 140మంది మృతి.. చాలా మంది గల్లంతు

ఇక, ఇజ్రాయెల్‌ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఎన్నో విపత్తులు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేస్తామన్నారు. రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తామన్నారు. నా పరిపాలనతో భారత్ తో పాటు ప్రధాని మోడీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని ఆయన వెల్లడించారు. అలాగే, హారిస్‌ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలను దెబ్బ తీస్తుంది.. నేను గెలిస్తే అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతాను అన్నారు.

Exit mobile version