Site icon NTV Telugu

Donald Trump: జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..

Biden, Trump

Biden, Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ విమర్శలు, ఆరోపణ ధాటి ఎక్కువ అవుతోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెంట్ జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపించాడు. ప్రసంగ సమయంలో బైడెన్ ‘గాలిపటం కన్నా ఎత్తు’లో ఉన్నాడని ఆరోపించారు. డ్రగ్ టెస్టులు జరగాలని డిమాండ్ చేశారు. గత నెలలో స్టేట్ ఆప్ ది యూనియన్ ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్ డ్రగ్స్‌పై ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. ఆయనతో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూనే, ఇలాంటి కార్యక్రమాలకు ముందు డ్రగ్ టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

Read Also: Soldiers Bus Accident: కారును ఢీకొట్టిన సైనికులు ప్రయాణిస్తున్న బస్సు.. ముగ్గురు మృతి, 26 మందికి గాయాలు..!

గురువారం కన్జర్వేటివ్ రేడియో షో హోస్ట్ హ్యూ హెవిట్‌తో కలిసి ట్రంప్ ముచ్చటించారు. ‘‘ వైట్ హౌస్‌లో కొకైన్ కనుగొన్నారని అనుకుంటున్నాను. అక్కడ ఏదో జరుగుతుందని నేను అనుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ నేను బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని చూశాను. అతడు మొదట్లో ఉవ్వెత్తున ఎగిసి, వేగంగా క్షీణిస్తున్నాడు. అక్కడ ఏదో జరుగుతోంది’’ అని ట్రంప్ అన్నారు. బైడెన్ కొకైన్ వాడినట్లు ట్రంప్ చెబుతున్నారా..? అని అడిగినప్పుడు.. ఏమి ఉపయోగిస్తున్నాడో తనకు తెలియదని అని చెప్పారు. అయితే, ‘‘అతను గాలిపటం కన్నా ఎత్తులో ఉన్నాడు’’ అని పరోక్షంగా డ్రగ్స్ మత్తులో ఉన్నాడని ఆరోపించారు.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్, ఈ ఏడాది నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో పోటీ పడబోతున్నారు. డ్రగ్స్ వాడుతున్నారని ట్రంప్ ఆరోపించడం కొత్త కాదు. గతంలో కూడా పలువురిపై ఈ ఆరోపణలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, తన డెమొక్రాట్ ఛాలెంజర్ హిల్లరీ క్లింటన్ పనితీరును మెరుగుపరిచే డ్రగ్స్ తీసుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. 2016లో ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా ట్రంప్ పదేపదే ముక్కున వేలు వేసుకోవడం కనిపించడంతో ట్రంప్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2016 డిబేట్‌లో ట్రంప్ పదే పదే ముక్కున వేలేసుకోవడం వల్ల డ్రగ్స్ సేవిస్తున్నారని మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హోవార్డ్ డీన్ ఆరోపించారు.

Exit mobile version