NTV Telugu Site icon

Trump Diet Coke Button: అమెరికా అధ్యక్ష భవనంలోని ట్రంప్ టేబుల్పై డైట్ కోక్ బటన్..

Diet Coke

Diet Coke

Trump Diet Coke Button: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవల్ ఆఫీసులోని ఆయన టేబుల్ పై స్పెషల్ బటన్ ను సిబ్బంది ఏర్పాటు చేశారు. ట్రంప్ ఈ బటన్ నొక్కగానే డైట్ కోక్ ను సిబ్బంది తీసుకొచ్చి ఇవ్వనున్నారు. అయితే, డైట్ కోక్ అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకే.. రోజుకు పది పన్నెండు ఈజీగా తాగేస్తారని ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా, తొలిసారి యూఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తన టేబుల్ పై ఈ బటన్ ను అమర్చాలని సూచించారు. తనకు డైట్ కోక్ కావాల్సిన ప్రతిసారీ సిబ్బందిని పిలిచి అడగకుండా ఉండేందుకు ఈ స్పెషల్ బటన్ ఏర్పాటు చేయించారని తెలిపారు.

Read Also: Elon Musk: ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం.. వివాదానికి దారితీసిన ‘నాజీ సెల్యూట్’

ఇక, డొనాల్డ్ ట్రంప్ తనకు డైట్ కోక్ ఎప్పుడు తాగాలనిపిస్తే.. అప్పుడు ఈ బటన్ నొక్కుతారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉండే గదిలో ప్రత్యేకమైన సైరన్ మోగుతుంది.. వెంటనే.. వారు ట్రంప్ కు కావాల్సిన డైట్ కోక్ ను తీసుకెళ్లి అందించనున్నారు. 2021లో అధ్యక్షుడిగా ఓవల్ ఆఫీసులోకి జో బైడెన్ అడుగు పెట్టిన తర్వాత ఈ స్పెషల్ బటన్ ను ప్రెసిడెంట్ టేబుల్ మీద నుంచి తొలగించారు. మళ్లీ నిన్న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో తిరిగి అధ్యక్షుడి టేబుల్ పైకి ఈ స్పెషల్ బటన్ వచ్చి చేరిందన్నమాట.