Twitter Logo Changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ తన లోగోను మార్చింది. ఇది చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న ‘‘బ్లూ బర్డ్’’ కనిపించడం లేదు. కొత్తగా బ్లూబర్డ్ స్థానంలో ‘‘డాగ్‌కోయిన్’’ లోగోను తీసుకువచ్చారు. జపాన్ మూలాలు కలిగిన కుక్క జాతి షిబా ఇనుగాను పోలిన డాగీ కోయిన్ ప్రస్తుతం ట్విట్టర్ లోగోగా దర్శనం ఇస్తోంది.
Read Also: Puttaparthi police action: పుట్టపర్తి అల్లర్లు… చర్యలకు రెడీ అయిన పోలీసులు
సోమవారం రాత్రి నుంచి ట్విట్టర్ తన లోగోను మార్చింది. దీంతో కొత్తలోగోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. డాగీ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా ఉంది. దీనిపై ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి 12.20 గంటల సమయంలో మస్క్ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. ఇందులో కారు డ్రైవింగ్ సీటులో కుక్క కూర్చోని తన లైసెన్స్ ను ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. మస్క్ చేసిన ఈ ట్వీట్ తో లోగోను మార్చినట్లు అర్థమవుతోంది.
— Elon Musk (@elonmusk) April 3, 2023
గతంలో కూడా డాగీ లోగోపై కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మస్క్ ఓ ఫోటోను ట్వీట్ చేసి, ట్విట్టర్ కొత్త సీఈఓ అద్భుతం అంటూ ట్విట్టర్ సీఈఓ కుర్చీలో కుక్క కూర్చుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేశారు. కీలకమైన ఉద్యోగులను తొలగించడమే కాకుండా.. 50 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.