Site icon NTV Telugu

డెల్టా వేరియంట్‌పై డా.ఫౌసీ ఆందోళ‌న‌…

డెల్టా వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్న‌ది.  ఈ వేరియంట్ ఇప్ప‌టికే 80కి పైగా దేశాల్లో విస్త‌రించింది.  మాములు మామూలు సార్స్ కోవ్ 2 వైర‌స్ కంటే ఈ డెల్టా వేరియంట్ ప్ర‌మాద‌కారి అని, వేగంగా విస్త‌రించే త‌త్వం క‌లిగి ఉన్న‌ట్టు అమెరికా అంటువ్యాధున నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌసీ తెలిపారు.  ఈ వ్యాధి తీవ్ర‌త‌కు కూడా ఈ వేరియంట్ ఒక కార‌ణం అవుతుంద‌ని డాక్ట‌ర్ ఫౌసీ తెలిపారు.  అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల‌ను ప్ర‌తి ఒక్క‌రు వేయించుకోవాల‌ని, ప్ర‌స్తుతానికి అదే ర‌క్ష‌ణ అని ఫౌసీ తెలిపారు.  ఇక ఇదిలా ఉంటే, అమెరికాలో జులై 4 నాటికి 70శాతం మంది ప్ర‌జ‌ల‌కు టీకా వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నా, సాధ్య‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 46శాతం మందికి మాత్ర‌మే టీకాను అందించ‌గలిగారు.  

Read: బ్యాడ్ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయమంటోన్న సిక్కులు! ‘గ్రహణం’పై నెటిజన్స్ ఆగ్రహం!

Exit mobile version