కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విశ్వరూపమే చూపిస్తోంది.. ఫస్ట్ వేవ్‌లో లక్ష మార్క్‌ను కూడా టచ్ చేయలేకపోయిన కోవిడ్ కేసులు.. సెకండ్ వేవ్‌లో ఇప్పుడు 4 లక్షల మార్క్‌ను కూడా దాటేశాయి.. మరోవైపు మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.. ఈ నేపథ్యం అంతర్జాతీయంగా కోవిడ్ మహమ్మారిపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ అంథోనీ ఎస్ ఫౌచీ.. భారత్‌లో మహమ్మారి కట్టడికి మోడీ సర్కార్‌కు కీలక సూచనలు చేశారు.. అందులో వ్యాక్సినేషన్, ఆస్పత్రులతో పాటు.. లాక్‌డౌన్ కూడా తప్పదని చెప్పుకొచ్చారు.
కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్‌లో స్పీడ్ పెంచాలన్న డాక్టర్ అంథోనీ ఎస్ ఫౌచీ… కోవిడ్ వ్యాప్తికి బ్రేక్‌లు వేయాలంటే మూడు మార్గాలున్నాయని.. నరేంద్ర మోడీ సర్కార్ సత్వర, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు టీకాలు వేయడం తప్పనిసరన్న ఆయన.. మరోవైపు.. ఆక్సిజన్ కొరత తీరాలంటే వెంటనే యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించి, ఉత్పత్తిని పెంచాలని కీలక సూచనలు చేశారు.. ఇక, ఆక్సిజన్, ఔషధాలు మొదలైనవాటి కోసం ఇతర దేశాల సహాయం తీసుకోవాలని.. అలాగే వీలైనంత త్వరగా మరిన్ని తత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, కరోనా కట్టడిలో భారత్‌లో సుదీర్ఘ లాక్‌డౌన్ అవసరం లేదని.. కనీసం.. రెండు మూడు వారాలు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. కాగా, ఇప్పటికే ఆక్సిజన్ కొరతపై ఫోకస్ పెట్టిన సర్కార్.. దానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. వ్యాక్సిన్ల కొరత ను తీర్చడానికి మరిన్ని విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది.. కానీ, లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.