NTV Telugu Site icon

Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి గురించి గాజా జర్నలిస్టులకు ముందే తెలుసా..?

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ భీకరంగా సాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం గాజాను చుట్టుముట్టింది. భూతల దాడులు చేస్తోంది. ఉత్తరగాజాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమైంది. దీంతో పాటు హమాస్ టన్నెల్ నెట్వర్క్‌తో పాటు హమాస్‌ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులను ముమ్మరం చేసింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని దారుణంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తుందనే విషయం గాజాలోని ఫోటో జర్నలిస్టులకు ముందే తెలుసనే వాదన వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన సమయంలో పెద్ద మీడియా సంస్థలకు పనిచేస్తున్న ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులు ఉండటాన్ని ఇజ్రాయిల్ దౌత్యవేత్త గురువారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారికి దాడి గురించి ముందస్తు సమచారం ఉందని ఆయన ఆరోపించారు. ఇజ్రాయిల్ సరిహద్దు ప్రాంతంలో దాడి చేస్తున్న సమయంలో గాజాలోని ఫోటోల జర్నలిస్టులు వాటిని కెమెరాల్లో బంధించారని ఇజ్రాయిల్ మీడియా వాచ్‌డాగ్ హానెస్ట్ రిపోర్టింగ్ నివేదికను కెనడాలోని ఇజ్రాయిల్ కాన్సుల్ జనరల్ ఇడిత్ షమీర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: Jalagam Venkata Rao: ఇండిపెండెంట్‌గా బరిలోకి మాజీ సీఎం కుమారుడు.. రేపు జలగం నామినేషన్‌

గాజా-ఇజ్రాయిల్ సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్ల మొదటగా దాడి చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టుల రెండు ఫోటోలను షమీర్ షేర్ చేశారు. ఒకదానిలో అక్టోబర్ 7 దాడికి సూత్రధారి అయిన గాజాలోని హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్, హసన్ ఎస్లయ్యా చెంపపై ముద్దు పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు.

హానెస్ట్ రిపోర్టింగ్ ప్రచురించిన నివేదికలో ఆరుగురు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులను గుర్తించింది. వీరిలో హసన్ ఎస్లాయా, యూసఫ్ మసౌద్, అలీ మహమూద్, హతేమ్ అలీ, మహ్మద్ ఫైక్ అబూ మోస్తఫా మరియు యాసర్ ఖుదీహ్ ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి సమయంలో అక్కడే ఉన్నారని నివేదించింది. వీరు రాయిటర్స్, ది అసోసియేటెడ్ ప్రెస్, ది న్యూయార్క్ టైమ్స్‌‌లో పనిచేస్తున్నారు. ఇజ్రాయిల్ ట్యాంకులు కాలిపోతున్న దృ‌శ్యాలను, జర్మన్-ఇజ్రాయిల్ మహిళ షానీ లౌక్‌తో సహా పలువురిని కిడ్నాప్ చేసిన, మృతదేహాలను తీసుకెళ్తున్న దృశ్యాలను వీరు చిత్రీకరించారు.

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ హసన్ ఎస్లయ్య కాలిపోతున్న ఇజ్రాయిల్ ట్యాంకు ముందు నిలబడి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ప్రెస్ అనే చొక్కా లేకుండా, హెల్మెట్ లేకుండా వార్ జోన్ నుంచి రిపోర్టింగ్ చేస్తుండటం ఇందులో చూడొచ్చు. ఇజ్రాయిల్ పై దాడి చేయాలని హమాస్ నెలల తరబడి ప్రణాళిక వేసుకున్నట్లు అర్థం అవుతోందని, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అక్టోబర్ 7 తెల్లవారుజామున గాజా సరిహద్దులో ఉగ్రవాదులతో ముందస్తు సమన్వయం చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదికలు బయటకు రావడంతో హసన్ ఎస్లాయాతో అన్ని సంబంధాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సీఎన్ఎన్ తెలిపింది.