Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో తిరిగి దేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాజధాని ఢాకాలోని షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం రాత్రి రెండు బాంబులు పేలాయి. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. షేక్ హసీనా సొంత దేశానికి తిరిగి వెళ్తున్న క్రమంలో వరసగా బంగ్లాదేశ్‌లో బాంబులు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మొదటిబాంబు ఎయిర్‌పోర్ట్ బయటి గేట్ వద్ద పేలింది, రెండో బాంబు జసిముద్దీన్ ప్రాంతంలోని ఫ్లైఓవర్‌పై పేలింది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో వస్త్రకార్మికులు వేతనాల పెంపు గురించి ఆందోళనలు చేస్తున్నారు.
డిసెంబర్‌లో షేక్ హసీనా బంగ్లాదేశ్ వెళ్తున్నారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా రైళ్లు, బస్సులు, బ్యాంకులు లక్ష్యంగా హింసాత్మక ఘటనలు, దహనాలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో హసీనాకు చెందిన నిషేధిత అవామీలీగ్, దాని అనుబంధ సంస్థల హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, షేక్ హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్ జిల్లాలో హింస తీవ్రంగా ఉంది. దీంతో 2000 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది. వీరితో పాటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కు చెందిన 10 దళాలు, స్పెషల్ రెస్పాన్స్ బెటాలియన్ (SRB) సిబ్బందిని కూడా మోహరించారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను డిమాండ్ చేసింది. అయితే, అప్పగింతపై భారత్ తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. మరోవైపు, షేక్ హసీనాను అప్పగించాలంటే బంగ్లాదేశ్‌కు భారత్ రెండు షరతులు విధించినట్లు నివేదికలు వెలువడ్డాయి. హసీనా భద్రతను బంగ్లాదేశ్ సైన్యం చూసుకోవడంతో పాటు ఆమెకు విధించిన ఉరిశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, నిష్పక్షపాత విచారణ జరగాలని గ్యారెంటీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

