Israel-Hezbollah War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. భారీగా అమెరికా బలగాలు మోహరింపు
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
- భారీగా అమెరికా బలగాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 300 రాకెట్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృతిచెందగా.. 700 మంది గాయపడ్డారు. రాకెట్లు లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లోని ప్రజలు ఇళ్లు, భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడే హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లుగా సమాచారం. గత వారం ఇరాన్ మద్దతుగల సాయుధ బృందం ఇజ్రాయెల్‌పై 140కిపైగా క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులు నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
తాజా ఉద్రిక్తతల వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాకు అదనపు బలగాలు పంపాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాల నడుమ పశ్చిమాసియాకు అదనపు దళాలను తరలించనున్నట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40 వేలమంది అగ్రరాజ్యం సైనికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 21 మంది చిన్నారులు మృతిచెందారు. మహిళలతో పాటు మొత్తం 300 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Kiwi Fruit Benefits: కివీ పండు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
తాజావార్తలు
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!