ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి పోషకాలు, విటమిన్లు అవసరం.
అందుకే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తినమని నిపుణులు సూచిస్తుంటారు.
రుచి కొద్దిగా పుల్లగా, తీపిగా ఉండే కివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కివీ జ్యూస్ తాగాలి. ఇది దృష్టిని పదునుపెడుతుంది.
కివీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
కివీ జ్యూస్ లోని మెగ్నీషియం, పొటాషియం.. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజూ కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య దూరమవుతుంది.
కివీ జ్యూస్ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఉదర సంబంధ సమస్యలు ఉంటే కివీ జ్యూస్ తీసుకోవడం మంచిది.