NTV Telugu Site icon

Israel-Hezbollah War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. భారీగా అమెరికా బలగాలు మోహరింపు

Israelhezbollah War

Israelhezbollah War

పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 300 రాకెట్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృతిచెందగా.. 700 మంది గాయపడ్డారు. రాకెట్లు లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లోని ప్రజలు ఇళ్లు, భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడే హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లుగా సమాచారం. గత వారం ఇరాన్ మద్దతుగల సాయుధ బృందం ఇజ్రాయెల్‌పై 140కిపైగా క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులు నిర్వహించింది.

ఇది కూడా చదవండి: Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!

తాజా ఉద్రిక్తతల వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాకు అదనపు బలగాలు పంపాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాల నడుమ పశ్చిమాసియాకు అదనపు దళాలను తరలించనున్నట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40 వేలమంది అగ్రరాజ్యం సైనికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 21 మంది చిన్నారులు మృతిచెందారు. మహిళలతో పాటు మొత్తం 300 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Kiwi Fruit Benefits: కివీ పండు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?