Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..

  • ఇస్లామీకరణపై డెన్మాన్ ఆందోళన..
  • అజాన్ బ్యాన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం..
Denmark

Denmark

డెన్మార్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభా, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రార్థనల కోసం పిలిచే ‘‘అజాన్’’ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డెన్మార్క్ ప్రభుత్వం భావిస్తోంది. డెన్మార్క్ వలసల వ్యవహారాల మంత్రి మోర్టెన్ బోడ్‌స్కోవ్ మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రాంతాలు ‘‘ఇస్లామాబాద్ శివార్లలా మారుతున్నాయి’’ అనే భావన కలుగుతోందని అన్నారు. డెన్మార్క్ ఇళ్ల పైకప్పులపై అజాన్ వినిపించకూడదు, దీనికి మా దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం డెన్మార్ మొత్తం జనాభాలో ముస్లింలు 5 శాతం ఉన్నారు. ఆ దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు. ప్రధాని మెట్టే ప్రెడరిక్సెన్ ప్రభుత్వం డెన్మార్‌లో యూరప్‌లోనే అత్యంత కఠినమైన వలస విధానాన్ని అమలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లు బురఖా ధరించడంపై నిషేధం విధించింది. విద్యాసంస్థల్లో ప్రార్థనా గదుల్ని తొలగించాలని ఆదేశించింది. అయితే, డెన్మార్‌లో అజాన్ నిషేధం గురించి చర్చించడం ఇదే తొలిసారి కాదు. 2020, 2025 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి పార్లమెంట్ దశకు చేరుకోలేదు.

అయితే, రాజధాని కోపెన్‌హాగన్ లోని ప్రాంతాల్లో శబ్ధకాలుష్యం వల్ల లౌడ్ స్పీకర్ల వాడకం తగ్గింది. నగరంలోని గ్రాండ్ మసీదు కూడా బహిరంగంగా అజాన్ ప్రసారం చేయడం లేదు. దేశవ్యాప్తంగా అజాన్‌ను పూర్తిగా నిషేధించడం రాజ్యంగంలోని మత స్వేచ్ఛకు విరుద్ధం అవుతుందా? అనే అంశాన్ని ప్రభుత్వం న్యాయపరంగా పరిశీలించనుంది. డెన్మార్క్ మాత్రమే కాదు పలు యూరప్ దేశాల్లో పెరుగుతున్న ఇస్లామీకరణపై ఆయర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి.