Site icon NTV Telugu

Denmarks queen mary: డెన్మార్క్ క్వీన్ మేరీని ఢీకొట్టిన స్కూటర్.. వీడియో వైరల్

Denmarksqueenmarygreenland

Denmarksqueenmarygreenland

గ్రీన్‌ల్యాండ్‌లో రాయల్ పర్యటన సందర్భంగా డెన్మార్క్ క్వీన్ మేరీని ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం తెలిపింది.

డెన్మార్క్ క్వీన్ మేరీ (52), ఆమె పిల్లలు ప్రిన్స్ విన్సెంట్, ప్రిన్సెస్ జోసెఫిన్‌తో కలిసి గ్రీన్‌ల్యాండ్‌లోని నూక్‌లో అభిమానులు, మద్దతుదారులతో ముచ్చటిస్తోంది. ఇంతలో ఒక వృద్ధుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌తో దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టాడు. అంతే అమాంతంగా బ్యాలెన్స్ కోల్పోయి ముందుకు పడిపోయింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి స్కూటర్‌ను ముందుకు వెళ్లకుండా ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. రాణికి ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం ప్రకటించింది.

ఇదిలా ఉంటే వాహనం అదుపు తప్పడానికి గల కారణమేంటో తెలియదని స్కూటరిస్టు పేర్కొన్నాడు. మరో సాక్షి మాట్లాడుతూ.. ఈ ఘటన ఆమెను ఎంతగానో బాధించిందని తెలిపాడు. ఆమె కళ్లు వెంటనే చెమ్మగిల్లాయని.. వేగంగా కొట్టడంతో బాధపడిందని చెప్పాడు.

Exit mobile version