NTV Telugu Site icon

బ్రిట‌న్‌ను వ‌ణికిస్తున్న డెల్టా, లాంబ్డా వేరియంట్‌లు…

క‌రోనా కేసులు ప్ర‌పంచాన్ని ఇంకా భ‌య‌పెడుతూనే ఉన్నాయి.  క‌రోనా మ‌హమ్మారి ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది వివిధ వేరియంట్‌లుగా మారుతున్న‌ది.  ఇలా మారిన వాటిల్లో డెల్టా వేరియంట్ భౌగోళిక ముప్పుగా అవ‌త‌రించింది.  సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఈ వేరియంట్ పెద్ద సునామిని సృష్టించింది.  ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి ఇండియా బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.  ఇప్పుడు డెల్టా వేరియంట్ యూర‌ప్ ను భ‌య‌పెడుతున్న‌ది.  బ్రిట‌న్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 35 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  

Read: ‘ఆచార్య’ షూటింగ్ బ్యాలెన్స్ 12 రోజులే!

దీంతో ఆ దేశంలో తిరిగి ఆంక్ష‌ల‌ను కఠినంగా అమ‌లు చేస్తున్నారు.  డెల్టాతో పాటుగా లాంబ్డా వేరియంట్ కూడా ఆ దేశాన్ని భ‌య‌పెడుతున్న‌ది. లాంబ్డా వేరియంట్ మొద‌ట పెరూ దేశంలో బ‌య‌ట‌ప‌డింది.  పెరూలో అల‌జ‌డిని సృష్టించిన లాంబ్డా వేరియంట్, బ్రిట‌న్‌లోకి ప్ర‌వేశించింది. ఒక‌వైపు డెల్టా, మ‌రోవైపు లాంబ్డా వేరియంట్‌లు బ్రిటన్ ను భ‌య‌పెడుతున్నాయి.