Site icon NTV Telugu

Republic of Balochistan: పాక్కి ఊహించని షాక్.. స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ

Balochi

Balochi

Republic of Balochistan: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ పై భారత్ మెరుపు దాడులతో దాయాది దేశానికి చావు తప్పి కన్నులొట్టపొయినట్లు అయింది. దీని నుంచి తేరుకునే లోపు పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే, బలూచిస్తాన్, పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్, దీర్ఘకాలంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా కొనసాగుతుంది.

Read Also: Terrorist Masood Azhar: మ‌సూద్ అజార్‌కు రూ. 14 కోట్ల నష్టపరిహారం.. పాక్ పీఎంవో వెల్లడి

కాగా, తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పాక్ సైన్యం చేస్తున్న అణచివేతలపై బలూచ్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కుల కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా కొనసాగుతుంది. ఇది పాకిస్తాన్ సైన్యంతో పాటు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించుకుంది. అలాగే, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. అలాగే, భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలను ఏర్పాటు చేయాలని కోరింది.

Exit mobile version