Site icon NTV Telugu

తుఫాన్ బీభత్సానికి 375 మంది బలి

ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు.

Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం ఎందుకు.. విప్పుకు తిరుగు

మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే చాలామంది బాధితులు నీరు, ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో భారీ వృక్షాలు విరిగిపడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్​ప్రెసిడెంట్​రొడ్రిగో డుటెర్టే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. తుఫాన్ బాధితులకు 2 బిలియన్​ పెసోస్​ (40 మిలియన్ ​డాలర్లు) సాయం ప్రకటించారు.

Exit mobile version