NTV Telugu Site icon

China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష

Jinping

Jinping

Death penalty for former ministers in China: అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా జిన్ పింగ్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటివరకు చైనాకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే జిన్ పింగ్ మాత్రం దీన్ని తిరగరాయబోతున్నారు.

Read Also: UPI Lite: పిన్‌, మొబైల్ డేటా లేకపోయినా పర్లేదు. ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.

ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్షలను ఖరారు చేశాయి అక్కడి కోర్టులు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణదండన విధించాయి. ఇప్పటికే న్యాయశాఖ మాజీ మంత్రితో పాటు ఓ అధికారికి రెండు రోజుల క్రితం మరణశిక్ష విధించగా.. శుక్రవారం మరో మాజీ మంత్రికి మరణశిక్ష విధించారు. లంచం తీసుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, భారీగా లంచాలు తీసుకోవడం, అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న నేరం కింద చైనా మాజీ ప్రజా భద్రత ఉపమంత్రి సన్ లిజున్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించింది కోర్టు. 2001 నుంచి 2020 వరకు వివిధ పదవులను నిర్వమించిన సన్ లిజున్ మొత్తం రూ. 750 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది.

17.3 మిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడిన మాజీ న్యాయశాఖ మంత్రి ఫు జెంగ్‌హువాకు, అత్యంత శక్తివంతమైన పోలీస్ చీఫ్ లలో ఒకరైనా ఫు జెంఘువా కు కోర్టు మరణశిక్ష విధించింది. కొన్ని గంటల వ్యవధిలో మాజీ జియాంగ్సు అధికారి వాంగ్ లైక్ కి కూడా మరణశిక్ష విధించింది. మాజీ మంత్రి సన్ లిజున్, అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు మద్దతుదారుగా ఉన్నారు. అయినా కూడా.. అవినీతి కేసుల్లో ఆయన తప్పించుకోలేకపోయారు.

Show comments