NTV Telugu Site icon

Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 50,000 దాటిన మరణాల సంఖ్య..

Gaza War

Gaza War

Gaza War: అక్టోబర్ 07, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడంతో పాటు 250 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజాలో హమాస్‌ని అంతం చేసేలా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) భీకరంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్రనేతల్ని వెతికి వెంటాడి చంపేసింది.

Read Also: Rishikonda Beach: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి

ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో పాలస్తీనా భూభాగంలో కనీసం 50,021 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ‘‘అక్టోబర్ 7, 2023 నుండి ఇజ్రాయెల్ దురాక్రమణకు మరణించిన వారి సంఖ్య 50,021 మందికి చేరుకుంది మరియు 113,274 మంది గాయపడ్డారు’’ అని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. ఇటీవల, బందీల విడుదల ఒప్పందంపై కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగింది. బందీల విడుదల జాప్యం కారణంగా, ఇజ్రాయిల్ బలగాలు మళ్లీ గాజాపై హమాస్ లక్ష్యంగా భీకరంగా దాడులు చేస్తున్నాయి.