Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు, పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ ఆహ్వానం మేరకు ఇరాన్ మంత్రి ఇస్లామాబాద్ వెళ్లారు. నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆఫ్ఘనిస్తాన్ మరియు పశ్చిమాసియాకు సంబంధించిన పాకిస్తాన్ అదనపు విదేశాంగ కార్యదర్శి రహీమ్ హయత్ ఖురేషి స్వాగతం పలికారు. అబ్దుల్లాహియాన్ పాక్ విదేశాంగ మంత్రితో పాటు ఆ దేశ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్‌తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి చర్చలు జరగనున్నాయి.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. పారిస్ వేదికగా చర్చలు..
షియా ముస్లిం మెజారిటీ ఉన్న ఇరాన్‌లో పాక్ సరిహద్దుల్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో సున్నీలు అధికంగా ఉంటారు. అయితే, వీరిలో కొంత మంది ఇరాన్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి పాక్ ఉగ్రవాద సంస్థలు మద్దతు తెలుపుతున్నాయనే ఉద్దేశంతో జనవరి 18న ఇరాన్, పాక్‌పై దాడి చేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజలు తర్వాత “మార్గ్ బార్ శర్మాచార్” అనే ఆపరేషన్ కోడ్‌లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్)పై దాడులు నిర్వహించినట్లు పాకిస్తాన్ వెల్లడించింది.