Site icon NTV Telugu

అమెరికా ఐటి సంస్థ‌పై సైబ‌ర్ దాడి…రూ.500 కోట్లు డిమాండ్‌…

ర‌ష్యాకు చెందిన హ్యాక‌ర్స్ దాడికి అమెరికా కంపెనీలు బెంబెలెత్తున్నాయి.  అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం క‌సేయాపై హ్యాక‌ర్స్ గ్యాంగ్ రాన్స‌మ్‌వేర్ తో దాడులు చేసింది.  ఈ దాడుల కార‌ణంగా వందలాది వ్యాప‌ర సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌కు బ్రేక్ ప‌డింది.  అమెరికాతో స‌హా మొత్తం 17 దేశాల‌పై సైబ‌ర్ దాడులు జ‌రిగాయి.  ర‌ష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం.  కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాల‌జీపై సైబ‌ర్ నేర‌గాళ్లు రాన్స‌మ్‌వేర్‌తో దాడులు చేశారు.  ఈ హ్యాక‌ర్స్ దాడులు చేసిన రెండు రోజుల త‌రువాత హ్య‌క‌ర్స్‌ను గుర్తించారు.  ల‌క్ష‌ల సంఖ్య‌లో కంప్యూట‌ర్లు హ్యాక్ అయ్యాయ‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  హ్యాక‌ర్స్ రూ.520 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేశార‌ని, డిమాండ్ చేసిన సొమ్మును తిరిగి చెల్లిస్తే బాధితుల ఫైల్స్ డీక్రిప్ట్ అయ్యే విధంగా చూస్తామ‌ని హ్యాక‌ర్స్ ప్ర‌క‌టించింది. 

Read: విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!

Exit mobile version