Site icon NTV Telugu

Crude Oil Price: దిగి వస్తున్న చమురు ధరలు..

వరుసగా పెరుగుతూ పోయిన క్రూడాయిల్‌ ధరలు మళ్లీ దిగివస్తున్నాయి… ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పరుగులు పెట్టింది క్రూడాయిల్‌ ధర.. ఇక, మళ్లీ ఇప్పుడు ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం రెండు వారాల కనిష్టానికి చేరుకుంది క్రూడాయిల్‌ ధర. ఓ వైపు రష్య-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు… రష్యాలో కరోనా కేసులు పెరగడంతో ఆ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4 డాలర్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 102 డాలర్ల 70 సెంట్లుగా ఉంది. ఈ నెలలో ఒకానొక దశలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 130 డాలర్ల వరకూ వెళ్లింది. అమెరికాలోని వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ – డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ విలువ వంద డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీఐ బ్యారెల్‌ 98 డాలర్ల 71 సెంట్లుగా ఉంది.

Read Also: Ukraine Russia War: జెలెన్‌స్కీ కీలక నిర్ణయం

Exit mobile version