Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం.. ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి
- థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం
- ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి
- హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్యాసింజర్ రైలుపై ఒక్కసారిగా భారీ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో 22 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read
బ్యాంకాక్‌కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళ్తున్న రైలుపై క్రేన్ కూలిపోయింది. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు జరుగుతుండగా క్రేన్ కూలిపోయింది.

రైల్లో మొత్తం 195 మంది ప్రయాణికులు ఉన్నారని రవాణా మంత్రి పిఫాట్ రచ్చకిత్ప్రకాన్ తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. రైలు లోపల చిక్కుకున్న ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!