Site icon NTV Telugu

Covid-19 Vaccine: కోవిడ్ కారణంగా పెరిగిన అకాల జననాలు.. ప్రమాదాన్ని తగ్గించిన కోవిడ్ వ్యాక్సిన్లు..

Covid 19

Covid 19

Covid-19 Vaccine: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెట్టింది. చైనాలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. లక్షల్లో ప్రజలు మరణించారు. రూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేసింది. చైనాతో పాటు అమెరికా, ఇటలీ, భారత్ వంటి దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. దీన్ని అంతం చేయడానికి ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్లను తయారుచేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు కోలుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే కోవిడ్ పాండిమిక్ వల్ల అకాల జననాలకు దారి తీసిందని, ఇలా ముందస్తు జననాలను(ప్రీమెచర్ బర్త్స్)ని తగ్గించడానికి కోవిడ్ వ్యాక్సిన్లు కారణమయ్యాని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా పరిశోధకులు కాలిఫోర్నియాలోని జనన రికార్డులు విశ్లేషించారు. మాటెర్నల్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు ముందస్తు డెలవరీల సంభావ్యతను 1.2 పాయింట్లు పెరిగి 7.1 నుంచి 8.3 శాతానికి పెంచిందని పరిశోధకులు తెలిపారు. 37 ఏళ్ల గర్భధారణ సమయానికి ముందుగానే జనానాలు జరిగాయని వెల్లడించింది.

2020 జూలై నుంచి నవంబర్ వరకు వైరస్ వ్యాప్తి చెందడంతో కోవిడ్-19 ఉన్న తల్లికి గడువు తేదీ కంటే మూడు వారాల కంటే ముందు బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఊహించిన దానికన్నా 5.4 శాతం పాయింట్లు ఎక్కువగా 6.9 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగిందని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది.

Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ గాజాను సందర్శించాలి.. ఆహ్వానించిన హమాస్..

2022లో ముందస్తు జననాలు చాలా వరకు పడిపోయాయి. అంతకుముందు 2021లోనే ముందస్తు జననాల ప్రమాదం కొద్దిగా తగ్గిందని పరిశోధకలు చెప్పారు. దీని కోసం 40 మిలియన్ల జనన రికార్డులను పరిశీలించారు. వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల ఇలా బిడ్డల ముందస్తు జననాల ప్రమాదం తగ్గిందని పరిశోధనలో తేలింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు.

కోవిడ్ వ్యా్క్సిన్లు రక్షణను పెంచినట్లు ఈ పరిశోధన హైలెట్ చేసింది. రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడం ద్వారా, ముందస్తు టీకాలు తీసుకోవడం వల్ల అమెరికాలో వేలాదిగా ముందస్తు జననాలను నిరోధించినట్లు తేలింది. గర్భిణిలు కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల అకాల జననాలు నివారించడంతో పాటు మరిన్ని ఆరోగ్య ఆందోళనలను తగ్గించడానికి సహాయపడిందని పరిశోధకులు తెలిపారు. గర్భంలో ఎదుగుతున్న పిండంపై టీకా ప్రతికూల ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యాక్సినేషన్ పిండానికి హాని కలిగిస్తుందనేది వాస్తవం కాదని తెలిపారు.

Exit mobile version