Site icon NTV Telugu

ప్ర‌పంచంపై క‌రోనా ప‌డ‌గ‌… ఏమాత్రం త‌గ్గని కేసులు…

ప్ర‌పంచంలో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  త‌గ్గిందిలే అనుకుంటున్న స‌మ‌యంలో తిరిగి క‌రోనా విజృంభిస్తుండ‌టంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమ‌వారం రోజున యూఎస్‌లో ఏకంగా ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  వ్యాక్సిన్ వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరుగుతుండ‌టం భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తోంది.  అమెరికాలోని ఆర్కాన్స‌న్ రాష్ట్రంలో అత్య‌ధిక కేసులు, ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్న‌ది.  సోమ‌వారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుప‌త్రుల్లో చేరారు.  ఇక అమెరికా త‌రువాత అత్య‌ధిక కేసులు ఇరాన్‌లో న‌మోద‌వుతున్నాయి.  స‌డ‌లింపులు కార‌ణంగా ఆ దేశంలో కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  సోమ‌వారం రోజున 40 వేల‌కు పైగా కేసులు న‌మోదుకావ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.  నిన్న‌టి రోజున ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  

Read: వైర‌ల్‌: పిత‌క్కుండానే పాలిచ్చేస్తోంది…

Exit mobile version