Site icon NTV Telugu

Flight: విమానంలో దంపతుల లైంగిక చర్య.. వీడియో వైరల్!

Swissflight

Swissflight

దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది.

నవంబర్‌లో బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న కమర్షియల్ ఫ్లైట్ స్విస్ ఎయిర్ విమానంలో దంపతులు ప్రయాణం చేస్తున్నారు. విమానం గగనతలంలో ఉండగా.. జంట ఓ చోటకు వెళ్లి లైంగిక చర్యలో పాల్గొన్నారు. అయితే దీన్ని గమనించిన విమాన సిబ్బంది.. రహస్యంగా మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం కాక్‌పిట్ సిబ్బంది.. గ్రూప్ చాట్‌లో వీడియోను ఫార్వడ్ చేశారు. అది కాస్త ఆయా సోషల్ మీడియా గ్రూప్‌లకు చేరుకుని వైరల్‌గా మారింది. దీన్ని గమనించిన ఎయిర్‌లైన్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బంది తీరును తీవ్రంగా ఖండించింది. ప్రయాణికుల గోప్యతను ఉల్లంఘించినందుకు స్విస్ ఎయిర్ సంస్థ విచారణకు ఆదేశించింది. ప్రయాణికుల భద్రతకు ఆటంకం కలిగించిన సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది.

స్విస్ ఎయిర్ సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రయాణికుల గోప్యతను ఉల్లంఘించారంటూ స్విస్ ఎయిర్ సంస్థపై మండిపడుతున్నారు. దంపతుల అనుమతి లేకుండా ఎలా రికార్డ్ చేస్తారంటూ నిలదీస్తున్నారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తు్న్నారు.

9/11 హైజాక్‌ల తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా విమానాల్లో అన్ని చోట్ల సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని స్విస్ ఎయిర్‌లైన్ సంస్థ ప్రతినిధి ఫుహ్ల్‌రోట్ తెలిపారు. కాక్‌పిట్‌లోకి దుండగులు చొరబడకుండా చూసేందుకు కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల గౌరవమే తమ ప్రాధాన్యత అని చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఫుహ్ల్‌రోట్ పేర్కొన్నారు.

 

Exit mobile version