Site icon NTV Telugu

మళ్లీ పంజా విసురుతోన్న కోవిడ్.. ఒకేరోజు 10 వేల మందికి పైగా మృతి

COVID 19

COVID 19

కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 ల‌క్షల మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో 10 వేల మందికి పైగా క‌రోనా బాధితులు ప్రాణాలు వదిలారు..

అయితే, కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. అమెరికా, బ్రిటన్‌, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది.. గత 24 గంట‌ల్లో అమెరికాలోనే 1.16 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 614 మంది మృతిచెందారు. ఇరాన్‌లో 39 వేలకు పైగా కేసులు, 568 మరణాలు సంభవించాయి.. బ్రిటన్‌లోనూ కొత్తగా 33 వేల కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి. జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మంది కోవిడ్‌ బారినపడగా.. 43,35,111 మంది ప్రాణాలు వదిలారు.. ఇక,కోవిడ్‌బారినపడి ఇప్పటి వరకు 18.5 కోట్ల మందికి పైగా పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మొత్తంగా మళ్లీ పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ నడుస్తున్నా.. మరోవైపు కోవిడ్‌ కలవరానికి గురిచేస్తోంది..

Exit mobile version