Site icon NTV Telugu

Chinese Woman: కుమార్తె బెడ్‌రూంలో స్పై కెమెరా.. తల్లిదండ్రులపై ఫిర్యాదు

Camera

Camera

చైనాలో ఒక యువతి (20) తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. కుమార్తె తీరుపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు ఆమె బడ్ రూంలో స్పై కెమెరాను ఏర్పాటు చేశారు. తప్పు చేసిన ప్రతీసారి ఆమె ఫోన్‌ను పేరెంట్స్ పగులగొడుతూ ఉండేవారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి చూడగా.. తన రూమ్‌లో కెమెరా ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి: Trump: ఒక మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నా.. స్టేజ్‌పైకి పిలిచి హగ్ చేసుకున్న ట్రంప్

తనకు స్వచ్ఛ కావాలని.. రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించింది. తాను ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు తెలిపింది. మొత్తానికి పోలీసులు రంగం ప్రవేశం చేసి.. తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత కెమెరా తీసేందుకు అంగీకరించారు. దీంతో ఆ యువతి ఇంటికి వెళ్లేందుకు మొగ్గు చూపింది.

ఇది కూడా చదవండి: Rahul gandhi: రాహుల్ కుట్టిన చెప్పులకు భలే గిరాకీ.. ఎంత పలుకుతుందంటే..!

Exit mobile version