NTV Telugu Site icon

Indian Medicine: చైనాలో భారతీయ మెడిసిన్స్‌కు భారీ డిమాండ్.. బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు

China Covid

China Covid

Chinese turning to Indian drugs on black market amid Covid spike: చైనాలో కోవిడ్-19 విలయతాండవం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో పాటు చాలా చోట్ల మందుల కొరత వేధిస్తోంది. దీంతో చైనీయులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెడిసిన్స్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ లో భారతీయ మందులను కొనుగోలు చేస్తున్నారు.

Read Also: Twitter Down: ట్విట్టర్ డౌన్.. మరోసారి లాగిన్ లో సమస్యలు

చైనా కోవిడ్-19 యాంటీ వైరల్ డ్రగ్స్ ను ఆమోదించింది. దీంతో ఫైజర్ కంపెనీ తయారు చేసే పాక్స్‌లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ హెచ్ఐవీ మందు అజ్వుడిన్ లను ఉపయోగిస్తోంది. ఈ రెండు కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరిమితంగా మందులు లభించడం, ధరలు అధికంగా ఉండటంతో చౌకైన ఇండియన్ మందులకు డిమాండ్ పెరిగింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ జౌషధాలను చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ జనరిక్ ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు.. వీటిని విక్రయిస్తే నేరంగా పరిగణించబడుతుంది.

చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో.. యాంటీ కోవిడ్ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ ఒక్కో బాక్స్ కు 1,000 యువాన్ల చొప్పున అమ్ముతున్నారు’’ వంటి అంశాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. యూజర్లు ఈ మందులు ఎలా పొందాలనే మార్గాలను అణ్వేషిస్తున్నారని అక్కడి సౌత్ చైనా మార్నింగ్ నివేదించింది. భారతదేశానికి సంబంధించిన 4 రకాల ఔషధాలు ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ అక్రమంగా అమ్ముడవుతున్నాయి. చైనా నిపుణులు మాత్రం ఈ మందుల వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వాటిని కొనుగోల చేయవద్దని ప్రజలను కోరుతున్నారు.