NTV Telugu Site icon

China Chickens Case: ఇదెక్కడి ప్రతీకారంరా నాయనా.. 1100 కోళ్లను భయపెట్టి..

China Chicken Case

China Chicken Case

Chinese Man Gets 6 Months In Jail For Scaring 1100 Of His Neighbour Chickens To Death: పక్కింటి వ్యక్తిపై పగ పెంచుకున్న ఒక చైనా వ్యక్తి.. ఓ విచిత్రమైన పనితో ప్రతీకారం తీర్చుకున్నాడు. తన చెట్లను నరికేసినందుకు.. అతని కోళ్లను టార్చ్‌లైట్‌తో భయబ్రాంతకులకు గురి చేసి, వారి ప్రాణాలను బలిగొన్నాడు. ఒకసారి శిక్ష పడినా మారకుండా, మరోమారు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో.. కోర్టు అతనికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. చైనాలో జరిగిన ఈ వింత ఘటన వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఒక ప్రాంతంలో గూ, జాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. మొదట వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉండేది. ఎలాంటి గొడవలు ఉండేవి కావు.

Dubai Car Number Plate: కారు నెంబర్ కోసం రూ.122 కోట్లు ఖర్చు.. వేలంలో గిన్నిస్ రికార్డ్

అయితే.. గతేడాది ఏప్రిల్‌లో జాంగ్ చేసిన ఒక పని, వీరి మధ్య చిచ్చు రేగేలా చేసింది. గూ పర్మిషన్ తీసుకోకుండా, అతని చెట్లను జాంగ్ నరికేశాడు. ఇక అప్పటినుంచి జాంగ్‌పై గూ పగ పెంచుకున్నాడు. అతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చెట్లను నరికేశాడు కాబట్టి, అతనికి సంబంధించిన ఆస్తుల్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అప్పుడే అతనికి ఒక బ్యాడ్ ఐడియా తట్టింది. జాంగ్ కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నాడు కాబట్టి, అతని కోళ్లను చంపేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. గూ కొన్ని రోజుల క్రితం ఒక రాత్రి జాంగ్ కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లాడు. అక్కడికెళ్లి సడెన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దాంతో భయబ్రాంతులకు గురైన ఆ కోళ్లు, ఒకేసారి మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి.. 500 కోళ్లు చనిపోయాయి.

Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా..

ఈ ఘటనపై జాంగ్ ఫిర్యాదు చేయగా.. గూ నేరస్తుడని తేలింది. అప్పుడు అతనికి రూ.35,179 జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. ఈ శిక్ష అనుభవించిన తర్వాత కూడా గూలో మార్పు రాలేదు. అతడు మరోసారి కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈసారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. గూని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. అతడు కావాలని ఈ పనికి పాల్పడ్డాడని, జాంగ్‌కు నష్టం కలిగించేలా చేశాడని కోర్టు నిర్ధారించింది. అతడ్ని దోషిగా తేల్చి, ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే.. జాంగ్‌కి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. గూ చేసిన పనికి జాంగ్‌కి చెందిన 1100 కోళ్లు మరణించగా, వాటి విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని తేలింది.