Beijing: చైనా ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. విమానంలో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని చాంగ్కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్తున్నది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్కింగ్ ఎర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు.
కాగా..ల్యాండింగ్ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 113 ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను నిలిపివేశారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
https://twitter.com/i/status/1524578661386506240
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!