చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని చాంగ్‌కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళ్తున్నది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్‌కింగ్ ఎర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు.
కాగా..ల్యాండింగ్ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 113 ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను నిలిపివేశారు.
https://twitter.com/i/status/1524578661386506240
