China’s Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్‌కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు… గొప్ప మార్క్సిస్ట్, గొప్ప శ్రామికవర్గ విప్లవకారుడు, రాజనీతిజ్ఞుడు, సైనిక వ్యూహకర్త మరియు దౌత్యవేత్త, కమ్యూనిస్ట్ పోరాట యోధుడు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజానికి కారకుడు’’ అని జిన్హువా ఓ లేఖలో పేర్కొంది.
Read Also: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి
1989లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించిన చైనా ప్రజలు అత్యంత క్రూరంగా అణిచివేసింది అక్కడి ప్రభుత్వం. తియానన్మెన్ స్వ్కేర్ ఘటన తర్వాత చైనా అధికారాన్ని చేపట్టాడు జియాంగ్ జెమిన్. 1989 ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను అణచివేయడంతో సహాయపడిన గొప్ప కమ్యూనిస్ట్ గా అక్కడి దేశ మీడియా కొనియాడుతోంది. ఈ అల్లర్ల సమయంలో డెన్ షావోపింగ్ నుంచి అధికారాన్ని చేపట్టాడు. తియానన్మెన్ స్వ్కేర్ అణచివేతలో అప్పటి అధ్యక్షుడు డెన్ షావోపింగ్ కు సహయపడ్డాడు.
ఈయన హాయాంలోనే ఆర్థిక శక్తిగా చైనా మారడం ప్రారంభించింది. 2003లో జియాంగ్ జెమిన్ పదవీ విరమణ చేసే నాటికి చైనా ప్రపంచవాణిజ్య సంస్థలో సభ్యదేశంగా చేరడంతో పాటు 2008లో బీజింగ్ ఒలింపిక్స్ హోస్ట్ బిడ్ కైవసం చేసుకుంది. దేశం సూపర్ పవర్ గా మారేందుకు జియాంగ్ జెమిన్ కృషి ఉంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలకమైన ‘షాంఘై గ్రూప్’కు చెందిన వ్యక్తిగా జియాంగ్ జెమిన్ కు పేరుంది. అయితే జీ జిన్ పింగ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జియాంగ్ జెమిన్ వర్గాన్ని అణచివేశాడు. ఇదిలా ఉంటే జెమిన్ మరణించిన సమయంలో చైనా వ్యాప్తంగా కోవిడ్ -19 ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తుండటం విశేషం.