Site icon NTV Telugu

China: నిర్బంధం అంతా అబద్ధం.. ప్రజల ముందుకు జిన్ పింగ్

Jinping

Jinping

Xi Jinping makes first public appearance since SCO meet: చైనాలో సైనిక కుట్ర జరుగుతుందని.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సదస్సు తర్వాత చైనాకు తిరిగి వచ్చిన అధ్యక్షుడు జి జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారని ప్రపంచ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులకు వరసగా ఉరిశిక్షలు విధించడంతో పాటు.. మూడోసారి అధ్యక్షుడు కావాలని భావిస్తున్న జిన్ పింగ్ వైఖరిపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలోని నాయకులకు రుచించడం లేదని అందుకే ఆయనపై తిరుగుబాటు జరిగిందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితం అయ్యాయి.

ఇదిలా ఉంటే ఇదంతా ఉత్తిదే అని తెలుస్తోంది. తాజాగా మంగళవారం ఆయన బీజింగ్ లో ఒక ఎగ్జిబిషన్ లో కనిపించారు. ఎస్ సీ ఓ సమావేశం తరువాత ఆయనపై సైనిక తిరుగుబాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రజల మధ్యలో కనిపించారు. దీంతో సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో జరిగిన వార్తలన్నీ ఊహాగానాలే అని తెలుస్తోంది.

Read Also: Russia: జార్జియా, కజకిస్తాన్ పారిపోతున్న రష్యన్ యువత

చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) ఐదేళ్లకు ఒకసారి జరిగే సమావేశాలకు చైనా సిద్ధం అవుతోంది. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా జి జిన్ పింగ్ పేరు సంపాదించుకున్నారు. గతంలో ఏ అధ్యక్షుడు అయినా పదేళ్ల మాత్రమే చైనాను పాలించారు. అయితే దీన్ని తిరగరాయబోయేలా అడుగులు వేస్తున్నారు జి జిన్ పింగ్. సీపీసీ సమావేశాల్లో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 20వ జాతీయ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల 2,300 ప్రతినిధుల పేర్లను ప్రకటించింది చైనా ప్రభుత్వం.

Exit mobile version